Sunday, May 19, 2024

IND-SA | రేప‌టినుంచే వన్డే పోరు.. రాహుల్‌ సారథ్యంలో భారత్‌ సిద్ధం

సౌతాఫ్రికా పర్యటనలో భార‌త్ టీ-20 సిరీస్‌ను ముగించుకుంది. ఇక, ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌ తర్వాతటీమిండియా ఆడే తొలి వన్డే సిరీస్‌ ఇదే కావడంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా, రేపటి (ఆదివారం) నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానండగా.. తొలి వన్డే జొహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. కేఎల్ రాహుల్‌ నేతృత్వంలోని టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని పట్టుదలతో ఉంది. ఇక, మెుదటి వన్డే జరిగే వాండరర్స్ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ , అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఆకాష్ దీప్.

దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మాక్రమ్‌, ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రైజ్ షంసీ, ర్లీస్ వాన్డర్, రస్సీ వాన్డర్ , లిజాడ్ విలియమ్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement