Thursday, May 9, 2024

OLA | ఓలా ఇయర్‌ ఎండ్‌ ఆఫర్‌.. 20వేల భారీ డిస్కౌంట్‌..

ప్రముఖ విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రక్‌ ఇయర్‌ ఎండ్‌ ఆఫర్లు ప్ర కటించింది. ఓలా ఎస్‌1 ఎయిర్‌, ఓలా ఎస్‌ 1 ప్రో కొనుగోలుపై 10వేల రూపాయలు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఓలా ఎస్‌ 1ఎక్స్‌ ప్లస్‌పై 20 వేల రూపాయల డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఆఫర్‌ ప్రారంభమైంది. డిసెంబర్‌ 17 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఓలా ఎస్‌1 శ్రేణిలో ఎస్‌1 ఎయిర్‌, ఎస్‌1 ప్రో రెండు స్కూటర్లై 5 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఓలా ఎస్‌1 ప్రో స్కూటర్‌కు అదనంగా ఐదేళ్ల బ్యాటరీ వారెంటీని ఇవ్వనున్నట్లు తెలిపింది. క్రెడిట్‌ కార్డ, క్రెడిట్‌ కార్డు ఈఎంఐ సాయంతో కొనుగోలు చేసిన వాళ్లు అదనంగా 5 వేలు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లతో కలిసి మొత్తం 10 వేల వరకు తగ్గింపు పొందవచ్చని ఓలా తెలిపింది. వీటి కొనుగోలుపై జీరో డౌన్‌ పేమెంట్‌ ఛార్జీ, జీరో ప్రాసెసింగ్‌ ఫీ వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement