Saturday, May 4, 2024

సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ లో నెయ్‌మార్ ..

బ్రెజిలియన్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ అధికారికంగా పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) నుండి సౌదీ అరేబియా క్లబ్ అల్-హిలాల్‌కు బదిలీ అయ్యాడు. దీనికి సంబంధించిన క్లబ్ ఆర్థిక వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. రెండు సంవత్సరాల కాలానికి నెయ్‌మార్ ఒప్పందంపై సంతకం చేసినట్లు చూపించే చిత్రాలను క్లబ్ షేర్ చేసింది.

‘‘క్యాపిట‌ల్ ఆఫ్ బ్యూటీ నుండి సివిలైజేష‌న్, హెరిటేజ్ అండ్ ది ఫ్యూచ‌ర్.. నేమార్ ఆసియా లీడ‌ర్ గా చేరాడు”అని సౌదీ క్లబ్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. అల్-హిలాల్ క్ట‌బ్ సౌదీ అరేబియా, ఆసియాలో అత్యంత విజయవంతమైన క్లబ్, 66 టైటిళ్లు గెలిచిన ఈ క్ల‌బ్ 18 దేశవాళీ, 4 ఆసియా లీగ్ టైటిళ్లను గెలుచుకున్న రికార్డును కూడా సొంతం చేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement