Wednesday, May 22, 2024

ధోనికి..సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

టీమిండియా కెప్టన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని బర్త్ డే ఇవ్వాళ. నేటితో 40వ పడిలోకి అడుగు పెట్టాడు ధోని. దీంతో సోషల్ మీడియా ధోని పుట్టిన రోజు శుభాకాంక్షలతో వెల్లువెత్తుతుంది. మరో వైపు సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం ధోనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు కెప్టెన్’ అంటూ కోహ్లీ సింపుల్ గా విషెస్ చెప్పేస్తే.. రైనా కాస్త భావోద్వేగపూరిత విషెస్ చెప్పాడు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. నువ్వే నా నేస్తం, నా సోదరుడు, నా గురువు. నాకన్నీ నువ్వే. కలకాలం ఆయురారోగ్యాలతో నువ్వు ఆనందంగా గడపాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఓ గొప్ప ఆటగాడిగా, గొప్ప నాయకుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశాడు. ఓ ఇంగ్లిష్ పాటను జోడించి ధోనీతో గడిపిన సందర్భాలను గుర్తు చేస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.

ఇక ఐసీసీ కూడా ధోనీకి విషెస్ చెప్పింది. అతడిని కెప్టెన్ కూల్ అనడానికి ఓ కారణముందని. క్రికెట్ లో అతడు తీసుకున్న గొప్ప నిర్ణయాలతో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ కెప్టెన్ కు హ్యాపీ బర్త్ డే చెప్పింది. ‘‘మా తలాకు సూపర్ బర్త్ డే. ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ”అంటూ ట్వీట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కొంచెం కొత్తగా విషెస్ చెప్పింది. ‘‘నంబర్ 7.. నువ్వెప్పుడూ అందరి నంబర్ 1’’ అంటూ ట్వీట్ చేసింది.  ఓ కెప్టెన్ లో గొప్ప స్నేహితుడంటూ పేసర్ ఇషాంత్ హ్యాపీ బర్త్ డే చెప్పాడు. దేశానికి టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అందించి ఆల్ టైం గ్రేటెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు ధోనీ.

ఇది కూడా చదవండి: అసోంలో భారీ భూకంపం..

Advertisement

తాజా వార్తలు

Advertisement