Thursday, May 2, 2024

టీ20 క్రికెట్‌లో మెక్‌ కియోన్‌ రికార్డు. 61 బంతుల్లో 109 పరుగులు..

వాంటా: ఫ్రాన్స్‌ జట్టు యువ క్రికెటర్‌ గుస్తావ్‌ మెక్‌ కియోస్‌ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు. 2024 టీ20 వరల్డ్‌ కప్‌ కోసం నిర్వహిస్తున్న యూరప్‌ సబ్‌ రీజినల్‌ అర్హత పోటీల్లో మెక్‌ కియోన్‌ మెరుపు సెంచరీ చేశాడు. వాంటాలో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 61బంతుల్లోనే 109 పరుగులు చేశాడు.

అందులో 5 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో 19ఏళ్ల గుస్తావ్‌ మెక్‌ కియోన్‌ పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌ హజ్రతుల్లా జజాయ్‌ పేరిట ఉన్న రికార్డును మెక్‌ కియోన్‌ బద్దలు కొట్టాడు. అయితే అతని జట్టు గెలవలేకపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement