Monday, April 29, 2024

Cricket | పాక్‌ క్రికెట్‌లో పలు మార్పులు.. చీఫ్‌ సెలెక్టర్‌గా అఫ్రిదికి చాన్స్​

మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది పాక్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా నియామకమయ్యాడు. వసీం అబ్బాసీ స్థానంలో పీసీబీ ఆఫ్రిదిని తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం పాక్‌ క్రికెట్‌లో పలు మార్పులు జరిగాయి. రెండు రోజుల క్రితం పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రజాపై ప్రభుత్వం వేటు వేసింది. ఆ తర్వాత నజామ్‌ సేథీ పీసీబీ చైర్మన్‌గా నియామకమయ్యారు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో పాక్‌ 0-3 తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత విమర్శలు రావడంతో క్రికెట్‌ బోర్డులో మార్పులు చేపట్టారు.

ఇదిలా ఉండగా యాషెస్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఘోర ఓటమి తర్వాత ఈసీబీ (ఇంగ్లండ్​ క్రికెట్​ బోర్డు)లో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. బ్రెండన్‌ మెకల్లమ్‌ జట్టుకు కొత్త కోచ్‌గా నియామకమయ్యాడు. అప్పటి నుండి ఇంగ్లండ్‌ జట్టు అద్భుతాలు చేస్తున్నది. అయితే.. పాకిస్తాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) సైతం అదే పద్దతిని అనుసరిస్తున్నది. షాహిది అఫ్రిదితో పాటు అబ్దుల్‌ రజాక్‌, రావ్‌ ఇప్తికర్‌ అంజుమ్‌ సైతం సెలక్షన్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పాత సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన జట్టును సమీక్షించి సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకుంటే మార్పులు చేసేందుకు కొత్త సెలెక్షన్‌ కమిటీకి పీసీబీ తొలి బాధ్యతను అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement