Thursday, May 2, 2024

Jaiswal: ఆందోళ‌న క‌లిగిస్తున్న జైస్వాల్ ఫామ్

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎంపికకు కొన్ని రోజులే సమయం ఉంది. ఓపెనింగ్‌ స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌ వరుసగా విఫలమవుతుండడంతో టీ20 జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలోనూ చెలరేగి టీమ్‌ఇండియాలో స్థానం సంపాదించిన యశస్వి.

- Advertisement -

ఇప్పుడు అదే లీగ్‌లో వైఫల్యంతో భారత జట్టులో తన చోటును ప్రమాదంలో నెట్టుకున్నాడు. 24, 5, 10, 0.. ఇవీ ఈ సీజన్లో జైస్వాల్‌ స్కోర్లు. ఈ నేపథ్యంలో నేడు జైపూర్ లో జరిగే గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తప్పక రాణించాల్సిందే. ప్రపంచకప్‌ చోటు విషయంలోనే జైస్వాల్‌ ఒత్తిడికి గురవుతున్నాడని.. అతను దాని గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. అతను వ్యక్తిగతంగా రాణించడంతో పాటు జట్టును గెలుపుబాట పట్టించడం అత్యావశ్యకం. రాజస్థాన్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గగా.. టైటాన్స్‌ 5 మ్యాచ్‌లాడి మూడు ఓడింది. గాయంతో గత రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయిన టైటాన్స్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశాల్లేవు. అతడి స్థానంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన కేన్‌ విలియమ్సన్‌కు మరో అవకాశం దక్కొచ్చు. ఈసారైనా అతను రాణిస్తాడేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement