Sunday, April 28, 2024

రిల‌య‌న్స్ చేతిలో ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కులు .. ఉచితంగా ప్ర‌సారం చేయ‌నున్న జియో

ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది రిల‌య‌న్స్. ఈ సీజన్ ను జియో సినిమాలో ఉచితంగా అందించాలని యోచనలో ఉన్నారు. టెలికాం దిగ్గజం జియో భారత్ లో ఐపీఎల్ 2023 సీజన్‌ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్లాన్ చేస్తోంది. గత నెల ఫిఫా ప్రపంచ కప్ ను ఉచితంగా ప్రసారం చేసి విజయం తర్వాత, రిలయన్స్ ఇప్పుడు ఐపీఎల్ కోసం ఇదే విధమైన వ్యూహాన్ని వర్తింపజేయాలని యోచిస్తోంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ హవా పెరగడంతో మొబైల్ ఫోన్లలోనూ మ్యాచ్ లను చూస్తున్నారు. ఇందుకోసం ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అదనపు రేట్లతో సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉంచుతాయి. అయితే, రిలయన్స్ జియో రాబోయే ఐపీఎల్ ను ఎలాంటి అదనపు డబ్బు చెల్లించుకుండా చూసేందుకు వీలు కల్పించనుంది.

వచ్చే సీజన్ మొత్తం తమ సబ్ స్క్రైబర్స్ (జీయో సిమ్ యూజర్స్) జియో సినిమా యాప్ లో మ్యాచ్ లను ఉచితంగా అందించనుంది. తద్వారా ఇతర నెట్ వర్క్ ఉపయోగించే వినియోదారులను తమ నెట్ వర్క్ కు మారేలా ఆకర్షించనుంది. గతంలో ఉచిత డేటాను అందించి సంచలనం సృష్టించిన జియో.. ఇప్పుడు ఐపీఎల్ ప్రసారాలతో మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కాగా, 2022 నుంచి 2027 వరకు ఐపీఎల్ ప్రసార డిజిటల్ హక్కులను జియో అనుబంధ సంస్థ వయాకామ్ 18 రూ. 23,758 కోట్లకు దక్కించుకుంది. మ్యాచ్ లు జియో సినిమా యాప్ లో ప్రసారం అవుతాయి. దీని ద్వారా సబ్ స్ర్కైబర్లను పెంచుకునే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఫిఫా వరల్డ్ కప్ ని జియో సినిమాలో ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు శుభవార్తని అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement