Thursday, April 25, 2024

మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్లోకి భారత్‌..

దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ (శాఫ్‌) చాంపియన్‌షిప్‌లో భారత్‌ వరుసగా రెండో విజయంతో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 9-0 గోల్స్‌ తేడాతో మాల్దివుల జట్టుపై విజయం సాధించింది. మన దేశం తరపున తెలంగాణా అమ్మాయి సౌమ్యగుగులోత్‌ (55 వ ని.లో, 86వ ని.లో) రెండు గోల్స్‌. కష్మీనా (84 వ ని.లో) ఒక గోల్‌ సాధించారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో 13న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. సౌమ్య గుగులోత్‌ 2001 జులై 18న జన్మించింది. భారత దేశ మహిళల జాతీయ జట్టుకు మిడ్‌ ఫీల్డర్‌గా ఆడిన ఒక భారతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి. గుగులోత్‌ సౌమ్య తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి. ఆమె 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారంకు ఎంపికైంది.

తెలంగాణా రాష్ట్రం నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం, కిసాన్‌ నగర్‌ తండాలో గుగులోత్‌ గోపి, ధనలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించింది. ఆమెకు ఇద్దరు అక్కలు, తమ్ముడు ఉన్నారు. సౌమ్య నిజామాబాద్‌ కేర్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. సౌమ్య ఆడపిల్ల కావడంతో మొదట తల్లిదండ్రులు ఆమెకు ఫుట్‌బాల్‌ కోచింగ్‌ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
కోచ్‌ నాగరాజు తల్లి దండ్రులను ఒప్పించాడు. సౌమ్య 2013 నుంచి ఫుట్‌బాల్‌ ప్రాక్టీసు చేస్తూ తెలంగాణా రాష్ట్ర అండర్‌
14,15,16 జట్లకు సౌమ్య ప్రాతినిద్యం వహించి, అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టులో స్థానం సంపాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement