Wednesday, May 15, 2024

MS Dhoni | క్రికెట్ అకాడ‌మీ పేరుతో మోసం.. కేసు న‌మోదు

టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడమీ పేరుతో తనను మోసం చేసి రూ.15 కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టులో కేసు వేశాడు. ధోనీ ఫిర్యాదు మేరకు ఆర్కా స్కోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై క్రిమినల్ కేసు నమోదైంది.

మిహిర్, సౌమ్యలు క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు 2017లో ధోనీతో ఒప్పందం కుదుర్చుకుని… ఫ్రాంచైజీ ఫీజు, లాభాల వాటా ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి మోసం చేయ‌డంతో ఆర్కా స్పోర్ట్స్‌కు పలు లీగల్ నోటీసులు పంపాడు ధోనీ. ఇప్పటి వరకు, ధోనీకి ఫ్రాంచైజీ ఫీజు, లాభాల వాటా రూపంలో రూ.15 కోట్లు రావాల్సి ఉంది. అందుకే చివరి ప్రయత్నంగా కోర్టును ఆశ్ర‌యించాడు ధోనీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement