Tuesday, May 7, 2024

అస‌లు స్పిన్ ఎలా అవుతుందో తెలుసుకో వార్న్: సెహ్వాగ్..

షేన్ వార్న్‌..ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డైన ఆస్ట్రేలియా దిగ్గ‌జం.. 1990 నుంచి ఓ దశాబ్దం పాటు తన స్పిన్ తో బ్యాట్స్ మెన్ ని వణికించాడు. అలాంటిది ఎలాంటి పిచ్ పై బంతి తిరుగుతుందో అనేది వార్న్ కి తెలియదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇండియా, న్యూజిలాండ్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైనల్ ల్లో న్యూజిలాండ్ ఒక్క స్పిన్న‌ర్‌ను కూడా తీసుకోకుండా బ‌రిలోకి దిగింది. దీనిని త‌ప్పుబ‌డుతూ షేన్ వార్న్ ఓ ట్వీట్ చేశాడు.

ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలించ‌నుంది. ఇప్ప‌టికే పిచ్‌పై అడుగుల మ‌ర‌క‌లు క‌నిపిస్తున్నాయి. స్పిన్ అయ్యేలా క‌నిపిస్తోందంటే క‌చ్చితంగా అవుతుంది. ఇండియా 275/300 కంటే ఎక్కువ‌ చేసిందంటే మ్యాచ్ ముగిసిన‌ట్లే అని వార్న్ ట్వీట్ చేశాడు. అయితే దీనికి మ‌క్కా అనే పేరున్న ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. షేన్ అస‌లు స్పిన్ ఎలా అవుతుందో నీకు తెలుసా? పిచ్ పొడిగా మారితేనే.. కానీ ఇక్క‌డ వ‌ర్షం కారణంగా పిచ్ పొడిగా మారే అవ‌కాశ‌మే లేదు అని ట్వీట్ చేశాడు. ఇది చూసి సెహ్వాగ్ న‌వ్వాపుకోలేక‌పోయాడు. షేన్ అస‌లు స్పిన్ ఎలా అవుతుందో తెలుసుకో అంటూ లాఫింగ్ ఎమోజీల‌ను పెట్టి వీరూ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడీ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement