Friday, May 3, 2024

Eng vs SL: శ్రీలంక టార్గెట్ 157 పరుగులు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ స్టోక్స్ 43 పరుగులు, జానీ బెయిర్ స్టో 30 పరుగుల, డేవిడ్ మలన్ 28 పరుగులు చేశారు.

శ్రీలంక బౌలర్లు లహిరు కుమార మూడు వికెట్లు, కసున్ రజిత రెండు, మాథ్యూస్ లు రెండు వికెట్ల చొప్పున తీశారు. దీంతో శ్రీలంక జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్ణీత 50ఓవర్లలో 157 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement