Tuesday, April 30, 2024

విడాకుల విష‌యం మా వ్య‌క్తిగ‌తం.. మీకెందుకు.. షోయ‌బ్ మాలిక్

ఈ మధ్య‌కాలంలో ప‌లువురు సెల‌బ్రిటీలు విడాకుల బాట ప‌డుతున్నారు. కాగా మ‌రో సెల‌బ్రిటీ జంట క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్.. టెన్నిస్ క్వీన్ సానియామీర్జా విడాకులు తీసుకోనున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.. ఈ విష‌యంపై షోయ‌బ్ స్పందించాడు..ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అని స్పష్టం చేశాడు. విడాకుల అంశంపై తాను గానీ, తన భార్య సానియా మీర్జా కానీ ఇంతకుమించి ఎలాంటి సమాధానం చెప్పబోమన్నాడు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు.

కాగా పాకిస్థాన్ నటి ఆయేషా ఒమర్ తో షోయబ్ మాలిక్ సన్నిహితంగా ఉండడం వల్లే వీరి కాపురంలో కలతలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. వీరి సన్నిహిత వర్గాలు కూడా ఎప్పుడో విడాకులు వచ్చేశాయని చెబుతున్నారు. అటు, సోషల్ మీడియాలో సానియా మీర్జా పెడుతున్న కొన్ని పోస్టులు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేవిగా ఉంటున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సానియా, షోయబ్ దీనిపై ప్రకటన చేస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement