Wednesday, April 17, 2024

సంప్రదాయాలలో ‘ప్రాలు'(బియ్యము)

అన్నాద్భవన్తి భూతాని”. ఆహారం చేతనే ప్రాణుల జీవిక సాగుతూ ఉంది. పుట్టింది మొదలు మరణించేవరకు ప్రతి ప్రాణికీ ఆహారం నిత్యావసరం. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క రకమైన ఆహారం ఈ సృష్టిలో నియమించబడింది. మానవులలో ఐతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రక మైన ఆహారపు అలవాట్లు ఏర్పడి ఉంటాయి. దక్షిణ భారత దేశంలో వరి ప్రధానమైన ఆహారంగా ఉంది. ఆహారం విలువను మనకు తెలియజెప్పడా నికా అన్నట్లు మన ఆచారాలు, సంప్రదాయాలు…. శుభాశుభ కార్యక్రమా లన్నింటిలో బియ్యం చాలా ప్రధాన పాత్రను పోషించడం చూడవచ్చు.
శిశువు జన్మించిన నవజాత శిశువును పురుటి స్నానం కాగానే, క్రొత్త చేటలో నిండుగా బియ్యం వేసి, దానిపై నూతన వస్త్రం పరచి, ఆ శిశువును దానిపై పడుకోబెట్టి, దేవుని విగ్ర#హం ముందు ఉంచి, నిర్మలమైన మనస్సుతో ధ్యానం చేస్తారు. అలా చేస్తే ఆ బిడ్డకు జీవితంలో అన్నవస్త్రాలకు, భగవంతుని కటాక్షానికి లోటు ఉండదని విశ్వాసం. బిడ్డకు నామకరణం కూడా ఒక క్రొత్త పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి, దానిలో ఆ శిశువు పేరు తండ్రితో వ్రాయిస్తా రు. అక్షరాభ్యాసం రోజున కూ డా ఇలాగే క్రొత్త పళ్ళెంలో నిండుగా బియ్యం వేసి పిల్లవాని చేయి పట్టుకొని ఆ బియ్యం లోనే అక్షరాలు దిద్దిస్తారు. ఉపనయన వేళలో కూడా వటువుకు ‘భిక్షం బియ్యం’ పెద్దలతో, దంపతులతో, ముత్తైదువులతో పెట్టిస్తారు. ఇక వివా#హ సమయంలో అక్షతల కు, తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్ష తలను- భిన్నం కాని శ్రేష్ఠమైన బియ్యం గింజలను పసుపు, కుంకుమ, నెయ్యి తో కలిపి తయారుచేస్తారు. ఆ నిండుగింజల వలే దంపతులు నిండు నూ రేళ్ళు సుఖసంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో అక్షతలను పెండ్లికి వచ్చిన వారంతా వధూవరుల పై ఆశీర్వాదపూర్వకంగా చల్లుతారు. ‘అక్షతలు’ అంటే ‘క్షతము’ (భిన్నము) కానివి, అంటే విరుగని నిండు గింజలు అని అర్థం. బియ్యం చంద్రగ్రహానికి సంబంధించిన ధాన్యం. మన: కారకుగైనన చంద్రుని ప్రభావం బియ్యంపై ఉంటుంది. ఆశీర్వదించే పెద్ద వారిలోని గొప్పదనం, వారి దీవెనల బలం విద్యుత్‌ ప్రవాహంలా వధూవరులకు అందుతుందని నమ్మకం.
వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం తలపై ఉంచే సమయంలో, మాంగళ్యధారణ సమయంలో, వధూవరులు పెద్దలకు నమస్కరించే సమయంలో, వారిపై పెద్దలు అక్షతలను చల్లి ఆశీర్వదిస్తారు. అప్పుడే కాదు. ప్రతి శుభకార్యంలోనూ పిన్నలు తమకు నమస్కరించే సందర్భాలలో పెద్దలు వారి తలలపై అక్షింతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’, ‘చిరంజీవ’, ‘సకల కామ్యార్థ సిద్ధిరస్తు’, ‘సంతాన ప్రాప్తిరస్తు’ అంటూ ఆయా సందర్భా లను బట్టి ఆశీర్వదిస్తూంటారు.
వివాహ సమయంలోనే కాకుండా ఇతర శుభకార్యాలలోను, పూజ లలోనూ అక్షతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పసుపు కలిపిన అక్షిం తలను అన్ని శుభకార్యాలలోను ఉపయోగిస్తారు. కుంకుమ కలిపిన వాటిని రక్తా క్షతలు అంటారు. దేవీ పూజలకు, కొన్ని శాక్తేయ పూజలకు వీటిని వాడతా రు. తెల్లని అక్షతలను రుద్రాభిషేకానికి వాడతారు.
ఇక తలంబ్రాలు. ‘ప్రాలు’ అంటే బియ్యము అని అర్థం. వధూవరులు ఒకరి తలపై ఒకరు వేడుకగా పోసుకొంటారు కనుక వీటికి తలబ్రాలు లేక తలంబ్రాలు అనే పేరు వచ్చింది. తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి విశి ష్ట స్థానం ఉంది. పెండ్లికి ముందు రోజే ముత్తైదువులు మంచిబియ్యంతో తలంబ్రాలు తయారుచేసి ఉంచుతారు
వధువును శ్రీలక్ష్మీ స్వరూపిణిగా, వరుని శ్రీమన్నారాయణునిగా మనం భావిస్తాము. తలంబ్రాల సమయంలో వధువు ధాన్యలక్ష్మిగా శోభి స్తుంది. ”ఓ వధువా! నీవు కుల వధువువై మా ఇంటికి వచ్చాక మన ఇంటిలో ధాన్యం ఇలా కుప్పలుతెప్పలుగా విరివిగా ఉండాలి. మనకు, మన అతిథుల కు జీవనాధారమైన ధాన్యంతో మన ఇల్లు నిత్యం సుఖసంపదలతో కళకళ లాడుతూ ఉండాలి” అనే అర్థం వచ్చేలా పురోహతుడు చదివే వేద మంత్రాల నడుమ ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. ముందు వధువు చేతిని వరుడు దర్భతో తుడిచి, ఆమె దోసిల్లో రెండుమార్లు బియ్యాన్ని వేసి, ఆ తరువాత కొన్ని పాలను చిలక రిస్తాడు. సిగ్గుల మొగ్గ అయిన ఆమె తలం బ్రాలను అతని తలపై పోస్తుంది. ”ఈ వధువు ద్వా రా వంశాభివృద్ధి జరుగు గాక! పూర్వీకుల పుణ్యం వృద్ధి చెందుగాక! శాంతి, పుష్టి, తుష్టి, వృద్ధి, ఆయురారోగ్యాలు, ఈ నవ దంపతులకు కలుగు గాక!” అనే అర్థం వచ్చేలా ”ప్రజామే కామస్య మృద్యతాం”, ”వశవోమే కామస్య మృద్య తాం”, ”యజ్ఞోమే కామస్య మృద్యతాం” అనే మంత్రాలు పఠిస్తారు.
తలంబ్రాల కార్యక్రమాన్నే అక్ష తారోపణం అనికూడా అంటారు. అంటే ఈ వివాహకర్మ ఆద్యంతం క్షతము అంటే నాశనము లేనిది కావా లని దీని భావం లోక కళ్యాణం కోసం చేసే దైవ కళ్యాణాలలో (సీతారాముల, శివపార్వతుల, లక్ష్మీశ్రీనివాసుల కళ్యాణా లలో) కూడా తలంబ్రాల వేడుక నిర్వహంప బడుతుంది. చాలా నిష్ఠతో, పవిత్రంగా ఆ తలం బ్రాలను తయారుచేస్తారు. లోకంలో అన్నానికి లోటు ఉండకూడదనే సంకల్పంతో ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని జరు పుతారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకంగా గోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. శ్రీరామ క్షేత్రంలో గోటి తలంబ్రాల పంటకు సంబంధించి వరి నారుపోసే దగ్గర నుండి, పంట పండించి, భక్తిశ్రద్ధలతో ఈ ధాన్యాన్ని గోళ్ళతో వలిచి తలంబ్రాలు తయారుచేసి, వాటిని కలశాలలో నింపి, తలపై మోసుకొని వచ్చి శ్రీసీతారాముల కళ్యాణ సమయంలో సమర్పిస్తారు
వివాహానంతరం పెళ్ళికూతురుకు ఒడిబియ్యం పెట్టే సంప్రదాయం కూడా చాలా ప్రాంతాలలో ఉంది. బియ్యంతోబాటు పసుపు, కుంకుమ, కాటుక, గాజులు, తాటాకు రేకు, నూతన వస్త్రాలు, పూలు, పండ్లు, ఫలహా రాలతో ఆమె ఒడి నింపుతారు. ఆమె ప్రక్కన ఉన్న అల్లుడిని శ్రీమన్నారాయ ణ స్వరూపునిగా భావించి పూజిస్తారు. పెళ్ళైన అమ్మాయిలకు ప్రతి సంవ త్సరం లేదా మూడేళ్ళకు ఒకసారి ఈ ఒడి బియ్యం వేడుక జరిపిస్తారు.
క్రొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసే సమయంలో కూడా ఇలాగే బియ్యంతో నిండిన గడపపై ఉంచబడిన కల శాన్ని ఇల్లాలు తన కుడికాలుతో లోపలకు నెట్టి, ఇంటిలోకి ప్రవేశింపజేసే సంప్రదాయం ఉంది. దేవతా విగ్ర హాలను ఆలయాలలో ప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ దేవతామూర్తులను ధాన్యాధివాసం (ధాన్యంలో ఉంచడం) చేయించడం జరుగుతుంది.
ఈ లోకంలో మన ఆయువు కేవలం నూకలు (బియ్యం గింజలు) మిగి లి ఉన్నంత వరకే. నూకలు చెల్లడం అంటే మరణించడం అని అర్థం. మర ణానంతరం కూడా దారిబత్తెం గింజలు అని భౌతిక కాయం నోటిలో నూగు లు, బియ్యము వేస్తారు. బియ్యం దానం ఇప్పిస్తారు. వరిపేలాలను చల్లుతా రు. ఇలా ప్రతి శుభాశుభకా ర్యాలలో మన పెద్దలు బియ్యం వాడుకకు ఎంతో
ప్రాధాన్య మిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement