Monday, May 6, 2024

IPL | సిక్స్​లు, ఫోర్లతో ధోనీ మ్యాజిక్​.. ఢిల్లీ టార్గెట్​ ఎంతంటే?

చెన్నైలో జరుగుతున్న మ్యాచ్​లో మరోసారి ధోనీ మ్యాజికల్​ స్ట్రోక్స్​ని అభిమానులు ఆస్వాదించారు. టాపార్డర్​ విఫలమై పెద్దగా స్కోర్లు చేయకున్నా అడపాదడపా దంచిన సిక్స్​లు, ఫోర్లతో చెన్నై పటిష్టమైన స్కోరు చేయగలిగింది. 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ధోనీ క్రీజులోకి రావడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మెల్లమెల్లగా కుదురుకుని ఫోర్లు, సిక్స్​లతో ధోనీ అలరించాడు. అయితే.. ఆఖరి ఓవర్​లో జడేజా క్యాచ్​ అవుట్​గా పెవిలియన్​ చేరడంతో చెన్నై ఏడు వికెట్లు కోల్పోయింది.

ఇక.. రుతురాజ్​ గైక్వాడ్​ (24), కాన్వే (10), అజింక రహానే (21), మోయిన్​ అలీ (7), శివమ్​ ధూబే (25), అంబటి రాయుడు (23), రవీంద్ర జడేజా (21) పరుగులు చేయగా.. ధోనీ 9 బంతుల్లో (20) పరుగులు చేశాడు. దీంతో చెన్నై టోటల్​ స్కోరు 167 చేయగలిగింది. ఈ క్రమంలో ఢిల్లీ టార్గెట్​ 168 పరుగులుగా ఉంది..​

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement