Saturday, May 4, 2024

CWC 2023 – మాక్స్ వెల్, గ్రీన్ ఔట్ – ఆసీస్ 142/7

చెన్నై – భార‌త్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పొయింది. 15 పరుగులు చేసిన గ్రీన్ ను ఏడో వికెట్ గా అశ్విన్ పెవిలియన్ పంపాడు..ఆరో వికెట్ గామాక్స్ వెల్ ను కులదీప్ ఔట్ చేశాడు మాక్స్ వెల్ 15 పరుగులు చేశాడు అంతకు ముందు జడేజా ఒకే ఓవర్ లో లబు షేన్, అలెక్స్ క్యారీలను పెవిలియన్ కు పంపాడు ….. ల‌బుషేన్ 27 పరుగులు చేయగా, క్యారీ డకౌట్ గా వెనుతిరిగాడు .

.ఇక మూడో వికెట్ స్టీవ్ స్మిత్ రూపంలో కోల్పొయింది.. జ‌డేజా బౌలింగ్ స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. స్మిత్ 46 ప‌రుగులు చేశాడు .. అలాగే రెండో వికెట్ గా 41 ప‌రుగులు చేసిన వార్న‌ర్ ను కుల‌దీప్ యాద‌వ్ ఔట్ చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఓవ‌ర్ లోనే ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ మార్ష్ ను సున్నా ప‌రుగుల‌కే బూమ్రా పెవిలియ‌న్ కు పంపాడు

ఆసీస్ 38 ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి ఏడు కోల్పొయి 142 ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement