Saturday, April 27, 2024

Crick Buz: న్యూజిలాండ్ మ‌రో వికెట్ డౌన్‌.. 55/8

భార‌త్ న్యూజిలాండ్ రెండో టెస్టులో ఇండియా బౌల‌ర్లు దూకుడుమీదున్నారు. టీ బ్రేక్‌కు ముందు 6 వికెట్లు తీసి స‌త్తా చాటారు. టాపార్డ‌ర్‌లోని టామ్ లాథ‌మ్‌, విల్ యంగ్‌, రాస్ టేల‌ర్‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ పెవిలియ‌న్ పంప‌గా.. ఆ త‌ర్వాత మిచ్చెల్‌ను అక్ష‌ర్ ప‌టేల్‌, హెన్నీ నిఖోల‌స్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ అవుట్ చేశారు.

16 ఓవ‌ర్ల‌లోనే 38 ప‌రుగుల‌కు 6 వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఆ త‌ర్వాత 19వ ఓవ‌ర్లో 53 ప‌రుగుల వ‌ద్ద మ‌రో వికెట్ న్యూజిలాండ్ కోల్పోయింది. టిమ్ సోథీని అశ్విన్ అవుట్ చేసి మొత్తం రెండు వికెట్లు తీశాడు. 55 పరుగుల వద్ద మరో వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. టీమిండియా బౌల‌ర్ల ధాటికి త‌ట్టుకోలేక న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మ‌న్ చేతులెత్తేస్తూ వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. 270 ప‌రుగుల‌ టార్గెట్ ఉండ‌డంతో ఫాలోఆన్ త‌ప్ప‌దా అనే ప‌రిస్థితి వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement