Monday, April 29, 2024

IPL | 2 వికెట్లు కోల్పోయిన చెన్నై.. ఓపెన‌ర్లు ఇద్ద‌రూ అవుట్‌

స్పిన్న‌ర్ రవి బిష్ణోయ్ రాక‌తో రుతురాజ్ గైక్వాడ్ (57)కు చెక్ ప‌డింది. ర‌వి వేసిన తొలి బంతిని పుల్ చేసిన గైక్వాడ్.. బ్యాట్ ఎడ్జ్‌కు త‌గిలి బాల్ పైకి లేచింది. దీంతో అంతా ఫోర్ పోతుంది అనుకున్న స‌మ‌యంలో బ్యాక్‌లో ఉన్న సీ వుడ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గైక్వాడ్ ఆట‌కు పుల్‌స్టాప్ ప‌డింది. దీంతో గైక్వాడ్‌, కాన్వాయ్‌ల జంట సాధించిన 110 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది రుతురాజ్ గైక్వాడ్ దంచికొట్టి చేసిన అర్ధ సెంచరీ అద్భుతం అనే చెప్పాలి. ఇక సీ ఉడ్ బౌలింగ్‌లో కాన్వే (47) కొట్టిన బంతిని కృణాల్ పాండ్యా క్యాచ్ ప‌ట్టాడు. దీంతో చెన్నై ఓపెనింగ్ జోడీ పెవిలియ‌న్ చేరింది. 10.3 ఓవర్లలో చెన్నై స్కోరు 119/2 గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement