Wednesday, May 1, 2024

గుజరాత్​ ప్లేయర్​ కేన్​ విలియమ్స్​కి తీవ్ర గాయం.. స్వదేశానికి పయనం

చెన్నై, గుజరాత్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో బాల్​ని పట్టుకునేందుకు గాల్లోకి లేచి డైవ్​ కొడుతూ నేలపై పడిపోయాడు టాప్​ ప్లేయర్​ కేన్​ విలియమ్స్​.. దీంతో అతడిని ఫీల్డ్​ నుంచి మెల్లగా నడిపించుకుని తీసుకెళ్లారు. అయితే.. తీవ్ర గాయం కారణంగా కేన్ విలియమ్సన్ ఆడలేకపోవడంతో స్వదేశానికి పయనమయ్యాడు. కాళ్లకు పట్టి కట్టుకొని క్రట్చెస్ సాయంతో నడుస్తున్నాడు.

“ఈ రెండ్రోజులుగా నాకు మద్దతుగా నిలిచిన చాలామందితో పాటు గుజరాత్ టైటాన్స్‌కు థాంక్యూ. నేను త్వరగా కోలుకునేందుకు మా ఇంటికి వెళ్తున్నాను. మీరు సానుభూతితో పంపిన ప్రతి మెసేజ్‌కు థాంక్యూ” అంటూ సోషల్ మీడియా వేదికగా కేన్​ మెస్సేజ్​ చేశాడు. అయితే.. కేన్‌ పరిస్థితి చూస్తే వరల్డ్‌ కప్‌ ఆడటం కూడా అనుమానమనే అంటున్నారు అనలిస్టులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement