Saturday, May 4, 2024

దసరా నుంచి వెన్నెల (కీర్తి సురేష్) డ్యాన్స్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

కీర్తి సురేష్, నాని కాంబోలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ‘దసరా’. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ.. బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దిగ్విజయంగా దూసుకెళుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీని సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మించారు.

కాగా, ఈ మూవీలో పెళ్లి సందర్భంగా కీర్తి సురేష్ చేసే మాస్ డ్యాన్సింగ్ వీడియోని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో ఈ మోస్ట్ లవింగ్ డ్యాన్స్ వీడియోకి కీర్తి సురేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఇటు యూట్యూబ్ లో సైతం ఈ డ్యాన్సింగ్ వీడియో అందరినీ అలరిస్తూ పెద్ద ఎత్తున వ్యూస్ తో కొనసాగుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement