Tuesday, April 30, 2024

Cricket: వెంటాడుతున్న గాయాలు.. వన్డే మ్యాచులకు కోహ్లీ, రోహిత్ దూరం..

దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య త్వరలో వన్డే సిరీస్ జరగనుంది.. అయితే గాయాల కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే చాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది. రెండో టెస్ట్‌ అఖరి నిమిషంలో వెన్ను నొప్పి కారణంగా కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో స్టార్ ఓపెనర్ కేఎల్‌ రాహల్‌ కెప్టెన్పీ బాధ్యతలు అందుకున్నాడు. టాస్‌ సమయంలో తాత్కాలిక సారథి రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం విరాట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం కోహ్లీ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అంతేకాకుండా కెప్టెన్ రోహిత్ కూడా గాయాల కారణంగా వన్డేలకు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది.

సోమవారం రెండో టెస్ట్ ఆరంభం కాగా.. శుక్రవారం (జనవరి 7) ముగియనుంది. ఇక జనవరి 11న మూడో టెస్ట్ ఆరంభం కానుంది. వెన్ను నొప్పి కారణంగా మూడో టెస్టుకు కూడా విరాట్ అందుబాటులో ఉండడని సమాచారం. అంతేకాకాకుండా వన్డే సిరీస్‌కు కూడా కోహ్లీ దూరం కానున్నాడని వార్తలొస్తున్నాయి. అంతకుముందు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ వన్డే సిరీస్‌ నుంచి తప్పకోనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో మాత్రం అతడు ఉన్నాడు.

టీమిండియా టీ20 కెప్టెన్‌ రోహత్‌ శర్మ (Rohit Sharma) కూడా గాయం బారిన పడిన విషయం తెలిసిందే. టెస్టులకు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా.. హిట్‌మ్యాన్ గాయపడ్డాడు. దీంతో రోహిత్ టెస్టులకు దూరమయ్యాడు. టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులో లేడు. దాంతో కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టును నడిపించనున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను వైస్ కెప్టెన్‎గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక భారత్‌, దక్షిణాఫ్రికా (IND vs SA) తొలి వన్డే జనవరి 19న జరగనుంది. 21, 23న రెండు, మూడు వన్డేలు జరగనున్నాయి. 

టీమిండియా వన్డే టీమ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, శర్దూల్ ఠాకుర్, మొహ్మద్ సిరాజ్.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement