Friday, May 3, 2024

రెండో టెస్టులో కీల‌క మార్పులు.. రహానేపై వేటు ఉంటుందా?

ముంబై : కివీస్‌తో తొలి టెస్టులో వికెట్‌ దూరంలో విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ముంబై వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. విశ్రాంతి నేపథ్యంలో తొలి టెస్టుకు దూరమైన కోహ్లీ.. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. బయో బబుల్‌లో చేరి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. కోహ్లీ ఎంట్రీ ఇవ్వడంతో.. ఎవరిపై వేటు వేస్తారా.. అనేది చూడాలి. వరుసగా విఫలం అవుతున్నా రహానేనే టార్గెట్‌ చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే తుది జట్టులో పెద్ద మార్పులు ఉండవని తెలుస్తోంది. మెల్‌బోర్న్‌ టెస్టు సెంచరీ తరువాత రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒక్కటీ ఆడలేదు. సిడ్నీ టెస్టు, బ్రిస్బేన్‌ టెస్టులోనూ విఫలం అయ్యాడు. కివీస్‌తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంప్‌లోనూ ఫెయిల్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఇదే కొనసాగించాడు. తాజాగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులోనూ.. (35, 4) మెప్పించుకోలేకపోయాడు.

ఫామ్‌లోకొచ్చిన అయ్యర్‌
శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌లో ఉండటంతో.. రహానేపైనే వేటు పడే అవకాశం ఉంది. రహానేకు మరో ఛాన్స్‌ ఇవ్వాలని భావిస్తే.. మయాంక్‌పై వేటు పడే ఛాన్స్‌ ఉంది. అప్పుడు కోహ్లీ లేదా పుజారా.. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. మయాంక్‌కు అవకాశం ఇస్తే.. రహానేపైనే వేటుపడుతుంది. అప్పుడు పుజారా, కోహ్లీ మిడిల్‌ ఆర్డర్‌లో ఆడుతారు. సాహా మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతని స్థానంలో శ్రీకర్‌ భరత్‌ను కొనసాగించే ఛాన్స్‌ ఉంది. అదే ఖాయం అయితే.. శ్రీకర్‌ ఐదో స్థానంలో వస్తాడు. స్పిన్నర్స్‌లో జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ కీలకం కానున్నారు. సిరాజ్‌ జట్టులోకి వస్తే.. ఇషాంత్‌పై వేటు పడుతుంది. ఉమేష్‌ పర్వాలేదనిపించాడు.

భారత్‌ తుది జట్టు (అంచనా) : శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌/అజింక్యా రహానే, పుజారా, విరాట్‌ కోహ్లీ, కేఎస్‌ భరత్‌/వృద్ధిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement