Sunday, April 28, 2024

Rohit Sharma వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఓట‌మి నుంచి కోలుకోలేకపోయా

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో ఓట‌మి త‌రువాత రోహిత్ శ‌ర్మ మొద‌టి సారిగా స్పందించాడు. ఈ ఓట‌మిని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోయిన‌ట్లు చెప్పుకొచ్చాడు. ఓట‌మి బాధ నుంచి బ‌య‌ట ప‌డ‌డం త‌న‌కు చాలా క‌ష్టంగా అనిపించింద‌న్నాడు. త‌న కుటుంబం, స్నేహితులు త‌న‌కు ఈ విష‌యంలో సాయం చేసిన‌ట్లు రోహిత్ శ‌ర్మ చెప్పుకొచ్చాడు.

‘నిజం చెప్పాలంటే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో ఓడిపోవ‌డం ఎంతో బాధ‌ను క‌లిగించింది. ఈ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోయాను. దీన్ని నుంచి ఎలా బ‌య‌ట‌కు ప‌డాలో నాకు తెలియ‌దు. ఆ స‌మ‌యంలో నా కుటుంబం, నా స్నేహితులు నాకు అండ‌గా ఉన్నారు. నా చుట్టూ ఉన్న విష‌యాల‌ను చాలా తేలిక చేశారు.’ అని రోహిత్ శ‌ర్మ అన్నాడు. ఇక ఓట‌మిని అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేమని, అయితే ఇది జీవితం క‌నుక ముందుకు సాగ‌క త‌ప్ప‌ద‌న్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement