Thursday, May 23, 2024

INDvsAUS | ఆస్ట్రేలియా సిరీస్‌కు అక్షర్ దూరం..

భార‌త్- ఆస్ట్రేలియా వ‌న్ డే సిరీస్‌లోని మొదటి 2 మ్యాచ్‌ల‌కు అక్షర్ పటేల్ దూరం కానున్నాడు. ఆసియా కప్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. ఆ తర్వాత శ్రీలంకతో ఫైనల్‌ కూడా ఆడలేకపోయాడు. ఆసియా కప్ ఫైనల్‌కు అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరాడు.

ఆసియా కప్ ఫైనల్ తర్వాత, అక్షర్ పటేల్ వచ్చే 10 రోజుల పాటు ఆడలేడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ఇంట‌ర్వూలో అన్నాడు. కాగా, ప్ర‌స్తుతం అక్షర్ పటేల్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందనున్నాడు. మరో 7-10 రోజుల్లో అక్షర్ పటేల్ పునరాగమనం చేస్తాడని రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అక్షర్ పటేల్ ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడో కచ్చితంగా చెప్పలేనని రోహిత్ శర్మ అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement