Sunday, April 28, 2024

ఆసియా హ్యాండ్ బ‌ల్ ఛాంప్ భారత్..

భారత హ్యాండ్‌బాల్‌ చరిత్రలో నూతన అధ్యాయానికి తెరలేచింది. భారత అమ్మాయిలు ఆసియా హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్లు గా అవతరించారు. కజకిస్థాన్‌ వేదికగా జరిగిన 16వ ఆసియా జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారతజట్టు తొలిసారి స్వర్ణపతకం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన టైటిల్‌ పోరులో థాయ్‌లాండ్‌పై భారత్‌ భారీ విజయం సొంతం చేసుకుంది. భారత అమ్మాయిల తుదిపోరులో ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించి 41-18తేడాతో ఘనవిజయం సాధించారు. మ్యాచ్‌ ప్రథమార్థంలోనే 20-09తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లిన భారతజట్టు ద్వితియార్ధంలోనూ అదేజోరును కొనసాగించింది.

యువ క్రీడాకారిణి భావనశర్మ ఉత్తమ ప్లేయర్‌గా, ఉత్తమ సెంటర్‌ బ్యాక్‌ప్లేయర్‌ అవార్డులు దక్కించుకుంది. చేతనశర్మ ఉత్తమ గోల్‌కీపర్‌గా నిలిచింది. తొలిసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ ఈక్రమంలో ప్రపంచ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మో హన్‌రావు మాట్లాడుతూ భారత జట్టు నవచరిత్రకు నాంది పలికింద న్నారు. మన అమ్మాయిల ప్రదర్శన పట్ల భారత్‌ ఎంతో గర్వపడుతోందన్నారు. ఆసియా జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ ఛాంపియన్‌గా నిలవడం ఇదే ప్రథమం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement