Sunday, April 28, 2024

ఏప్రిల్ 22న జ‌య‌మ్మ పంచాయతీ

ప్రముఖ యాంకర్‌ సుమ నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’ విడుదల తేదీని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. వేసవి సీజన్‌లో ఏప్రిల్‌ 22న విడుదలకు సిద్ధమైనట్టు వీడియో ద్వారా ప్రకటించారు. విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన చిత్రమిది. పల్లెటూరు నేపథ్యంలో తీసిన చిత్రమిది. టీ-జర్‌, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది.

ఇటీవలే రామ్‌ చరణ్‌ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయగా, నాని ఫస్ట్‌ సింగిల్‌, రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను కూడా ఆవిష్కరించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, అనూష్‌ కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement