Thursday, May 9, 2024

Asian Games – 50 మీట‌ర్ల రైఫిల్ విభాగంలో భార‌త్ కు మరో గోల్డ్ మెడల్ తో పాటు బ్రోంజ్ , కాంస్య పతకాలు ..

చైనాలో జ‌రుగుతున్న అసియా క్రీడ‌ల‌లో భార‌త్ షూట‌ర్లు ప‌త‌కాల పంట ప‌డిస్తున్నారు.. నాలుగు రోజైన నేడు ఏకంగా రెండు బంగారు , ఒక వెండి, రెండు కాంస్య ప‌త‌కాలు సాధించారు.. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ సమ్రా కౌర్ (469.6 పాయింట్లు) ప్రపంచ రికార్డును నమోదు చేయడంతోపాటు బంగారు పతకం సొంతం చేసుకోగా ఇదే విభాగంలో పోటీప‌డిన మ‌రో భార‌త షూట‌ర్ అషి చౌష్కి కాంస్య ప‌త‌కం ద‌క్కించుకుంది.. . చైనాకు చెందిన షూటర్ జంగ్‌ (462.3 పాయింట్లు) రజతం పొందింది.

ఇక పురుషుల 50 మీటర్ల స్కీట్‌ షూటింగ్‌ విభాగంలోనూ భారత్ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది.. గురుజ్యోత్,అంగ‌ద్ వీర్, అనంత్ జీత్ లో కూడిని పురుషుల జ‌ట్టు మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి మూడో స్థానంలో నిలిచారు.. దీంతో వారికి కాంస్య ప‌త‌కం ల‌భించింది..

అంత‌కు ముందు 50 మీటర్ల రైఫిల్‌ విభాగం(3 పొజిషన్స్‌)లో భారత మహిళా జట్టు సిల్వర్‌ మెడల్‌ సాధించింది. షూటింగ్‌ త్రయం సిఫ్ట్‌కౌర్‌ సమ్రా, మనిని కౌశిక్‌, ఆషి చోక్సీ తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం అందించారు..

ఇక 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్‌, రిథం సంగ్వాన్‌, ఇషా సింగ్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ ఖాతాలో మరో పసిడి చేర్చారు. దీంతో ఒక్క రోజే భార‌త్ షూట‌ర్ల‌కు రెండు బంగారు, ఒక వెండి, రెండు కాంస్య ప‌త‌కాలు ద‌క్కాయి..

- Advertisement -

కాగా, ఇప్పటి వరకు భారత్‌ పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement