Saturday, May 4, 2024

డబ్ల్యూటీఏ ఫైనల్స్ తర్వాత నా కెరీర్ ను ముగించబోతున్నా.. సానియా మీర్జా

త‌న కెరీర్ కి గుడ్ బై చెప్ప‌నుంది టెన్నిస్ దిగ్గ‌జ ప్లేయ‌ర్ సానియామీర్జా. స్వయంగా ఆమెనే దీనిపై స్పష్టత ఇచ్చింది. దుబాయిలో వచ్చే నెలలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్ తర్వాత తన కెరీర్ కు ముగింపు చెప్పనున్నట్టు సానియా మీర్జా ప్రకటించింది. ఓ వెబ్ సైట్ తో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. డబ్ల్యూటీఏ ఫైనల్స్ తర్వాత నా కెరీర్ ను ముగించబోతున్నాను. ఎందుకంటే యూఎస్ ఓపెన్ ముందు నేను గాయపడ్డాను. దాంతో బయటకు రావాల్సి వచ్చింది. నాకు నచ్చినట్టుగా చేసే వ్యక్తిని. గాయం కారణంగా బలవంతంగా తప్పుకోవాల్సిన పరిస్థితి వద్దు. నా వయసు 36 ఏళ్లు. ఇక ముందు కెరీర్ లో కొనసాగేందుకు వీలుగా భావోద్వేగాలను నియంత్రించుకునేంత శక్తి లేదు అని సానియా మీర్జా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement