Thursday, April 25, 2024

జల్లికట్టు నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదు : ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ : సాంప్రదాయాలకు నిబంధనలు లేదు కానీ జల్లికట్టు ఆనవాయితీల పేరుతో మూగజీవులను హింసించడం నేరమని గ్రామాలలో జల్లికట్టు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి శనివారం తెలియజేశారు. అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే జల్లికట్టు నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. జల్లికట్టు నిర్వహించే గ్రామాలలో ఇప్పటికే కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు నోటీసులు కూడా జారీ చేస్తున్నామన్నారు. ఆదేశాలను లెక్కచేయకుండా నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో జరిగే జల్లికట్టు గురించి కూడా ఆరా తీస్తున్నాంమన్నారు. సంక్రాంతి పండుగను పురష్కరించుకొని సాంప్రదాయం, జల్లికట్టు ఉత్సవం అనే పేరుతో మూగజీవులను హింసించడం నేరం పశువులను నిలువరించే క్రమంలో వాటి కొమ్ములు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే పశువులు భయభ్రాంతులకు గురై జన సమూహం మీద దాడి చేసే ఆస్కారంతోపాటు తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉందని వివరించారు. ముఖ్యంగా నేడు అది ఒక ఆటవిడుపుగా కాకుండా వ్యాపార కేంద్రంగా మారే అవకాశంతో పాటు ప్రమాదం కూడా ఉందని సంతోషంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సిన పండుగను హింసాత్మకంగా మార్చకుండా భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. జల్లికట్టు సమయంలో అనుకొని ఘటనలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయన్నారు. ఉల్లాసంగా జరుపుకునే క్రీడను అపాయకరంగా మార్చకూడదు, ఎవరికైనా అపాయం జరిగితే లేదా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరించి పశువులు ఉన్న యజమానులకు, అలాగే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా జల్లికట్టు జరుగు గ్రామాలలో నోటీస్ లతో పాటు కౌన్సిలింగ్ కూడా నిర్వహించి భద్రతాపరమైన అన్ని చర్యలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇటీవల జల్లికట్టు ఒక చోట నిర్వహించినందున అక్కడ ప్రజలకు కొంతమందికి గాయాలవ్వడం జరిగిందని వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి నిర్వాహకులపై కేసు నమోదు కూడా చేశామన్నారు. ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. కరోనా కూడా ప్రస్తుతం మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా అందరి శ్రేయస్సు కోరి నిబంధనలను పాటిస్తూ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఎస్పీ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement