Thursday, May 2, 2024

Sports | టెస్టుల్లో విలియమ్సన్‌ నెంబర్‌ వన్‌న్యూజిలాండ్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐసీసీ పురుషుల టెస్టు ప్లేయర్స్‌ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ చాలా వేగంగా టాప్‌ ర్యాంక్‌కు చేరువవుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానంలో నిలిచాడు.

అయితే నెంబర్‌ స్థానంలో ఉన్న జో రూట్‌ను కేన్‌ విలియమ్సన్‌ వెనక్కి నెట్టేశాడు. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన రూట్‌ ప్రస్తుతం అయిదో స్థానానికి పడిపోయాడు. టెస్టుల్లో విలియమ్సన్‌ టాప్‌ ప్లేస్‌లోకి రావడం ఇది ఆరోసారి. గతంలో 2015 నవంబర్‌లో తొలిసారి అతను ఆ ఫీట్‌ అందుకున్నాడు. చివరిసారి ఆగస్టు 2021లో అగ్ర స్థానంలో నిలిచాడు.


- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement