Friday, May 3, 2024

Nabha Natesh: క్యూట్ క్యూట్ గా ఇస్మార్ట్ బేబి….

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. మొదటి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ తెలుగు లో మంచి హీరోయిన్ గా నిలుస్తుందని అప్పుడే అంతా అనుకున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమాలో మాస్‌ రోల్‌ లో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఆ సినిమా సక్సెస్ హెల్ఫ్‌ అవ్వకుండా కరోనా అడ్డు రావడంతో ఈ ముద్దుగుమ్మకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. సినిమాలతో ఎక్కువ బిజీ లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

తాజాగా మరోసారి ఈ అమ్మడు అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, తాను ఇస్మార్ట్‌ బ్యూటీని అంటూ నిరూపించుకునే ప్రయత్నం చేసింది..గ్లామ‌ర్ తోనే సంప్ర‌దాయ వ‌స్త్రాల‌లోనూ త‌న‌లో మెరుపులున్నాయంటూ ఫోటోలో షేర్ చేసింది.. ఈ పిక్స్ లో న‌భా మ‌రింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement