Thursday, May 2, 2024

Neha Shetty : రాధిక ఏంటి… ఈ మంట‌లు …

నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. డీజే టిల్లు చిత్రం తర్వాత నేహా శెట్టికి సూపర్ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు.

- Advertisement -

డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల టిల్లు స్క్వేర్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నేహా శెట్టి కామియో రోల్ లో నటించింది.

దీనితో మరోసారి సోషల్ మీడియాలో రాధికా అనే పేరు తెగ వైరల్ అవుతోంది. అంతా రాధికా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్రంలో కథకి ఆమె పాత్రని బాగానే లింక్ చేశారు. ఈ చిత్రం చూస్తేనే ఆమె ఎలాంటి కామియో రోల్ చేసిందో అర్థం అవుతుంది. నేహా శెట్టి తాజాగా అద్భుతమైన లెహంగాలో ఫోజులు ఇచ్చింది. నేహా శెట్టి అందంతో మెప్పిస్తూ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. ఆమె ఫోటోలకు నెటిజన్లు రాధికా అక్కా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement