Sunday, May 19, 2024

AP | రేపటినుంచే పెన్షన్ ల పంపిణీ.. ఉత్తర్వులు జారీ

ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు విధాలుగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వికలాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, వితంతువులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేయనున్నారు.

మిగతా విభాగాల పెన్షన్ లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ద్వారానే పింఛన్‌ అందజేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో గ్రామ సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సేవలు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం పింఛన్ల పంపిణీ ప్రారంభించి ఏప్రిల్ 6 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement