Sunday, April 21, 2024

AP – చిన్నాన్నను చంపిన హంత‌కుడిని గెలువ నివ్వ‌ను…ష‌ర్మిల

అమరావతి : చిన్నాన్న వివేకాను హ‌త్య చేసిన హంత‌కుడు గెలువ‌కూడ‌ద‌నే తాను క‌డ‌ప లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేస్తున్నాన‌ని పిసిసి ఎపి చీఫ్ ష‌ర్మిల అన్నారు. క‌డ‌ప‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్‌ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. చిన్నాన్న వైఎస్‌ వివేకానందాను హత్య చేయించిన వాళ్లను జగన్‌ వెనకేసుకొస్తున్నారని, హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. వివేకాను చంపించిన అవినాష్ కు జగన్‌ టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం వాడుకుందని, విమర్శించారు.

నేను కడప ఎంపీగా నిలబాలనేది వివేకా చివరి కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా పోటీలో దిగుతున్నానని స్పష్టం చేశారు. హంతకుడు అవినాష్‌ను ఎంపీ కానివ్వకపోవడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు. ‘ ఈ నిర్ణయం సులువైంది కాదని నాకు తెలుసు. కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా కూడా ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని, జగనన్న హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని మండిపడ్డారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement