Friday, May 17, 2024

Pushpa-2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, రష్మిక మందన్న కథానాయికగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ భారీ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2”. ఈ సినిమాపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement