Thursday, April 25, 2024

Sarah-Jane Dias : బికినీతో పంజా…

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన స్టైలిష్ మూవీ పంజా లో ఒక హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ సారా-జేన్ డయాస్. ఈ అమ్మడు తర్వాత తెలుగు లో పెద్దగా కనిపించలేదు. కానీ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బాలీవుడ్ లో సందడి చేసింది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్ లతో సందడి చేస్తోంది.

- Advertisement -

వెండితెరపై హీరోయిన్ గా రాణించడం లో విఫలం అయినా కూడా వెబ్ సిరీస్ ల్లో నటిగా రాణిస్తోంది. మరో వైపు సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు రెగ్యులర్ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. టాప్ రికార్డులు తిరగరాసే సినిమాలు తాజాగా మరోసారి సారా-జేన్ తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసింది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

బికినీ అందాలతో మతి పోగొట్టిన సారా జేన్ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న కూడా వెండి తెరపై సందడి చేయదేం అనే కామెంట్స్ వస్తున్నాయి. సినీ కెరీర్‌ ఆరంభించి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా నెట్టింట సందడి చేస్తున్న సారా జేన్ భవిష్యత్తులో అయిన నటిగా వెండి తెరపై వెలుగు వెలుగుతుందేమో చూడాలి. హీరోయిన్ గా మరోసారి ఈ అమ్మడికి ఒక్క సారి ఛాన్స్ వస్తే బాగుండు అంటూ ఆమె ఫోటో షూట్‌ అందాలు చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సారా కి మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ దక్కేనా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement