Thursday, May 2, 2024

Ananya Pandey : హీరోయిన్స్ పై షాకింగ్ కామెంట్స్…..

బాలీవుడ్ లో తక్కువ టైం లోనే అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అనన్యా పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో తెరంగేట్రం చేసిన అనన్యా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చింది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో ఆడియన్స్ ను అలరిస్తున్న అనన్యా పాండే సౌత్ ఆడియన్స్ ని మెప్పించేందుకు లైగర్ సినిమాతో వచ్చింది..

అయితే ఆ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యింది. అందుకే సౌత్ సినీ ఆఫర్లను పక్కన పెట్టి బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తుంది. హీరోయిన్ గా ఒక మోస్తారుగా కెరీర్ ను కొనసాగిస్తున్న అనన్యా పాండే తన మనసులో ఉన్న మాటను చెప్పడంలో ఎలాంటి మొహమాటం చూపించదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కథనాయికల మధ్య స్నేహం గురించి పెద్ద క్లాసే తీసుకుంది అనన్యా.

- Advertisement -

కథానాయికల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని. బయట నుంచి చూసే మీకు ఇదంతా ఏమి కనిపించదని అంటుంది అనన్యా పాండే. ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంతా కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అందులో భాగంగానే తనకు దీపిక పదుకొనె, భూమి పడ్నేకర్ లాంటి వారితో నటించే అవకాశం దక్కిందని అంటుంది అనన్యా పాండే.

Advertisement

తాజా వార్తలు

Advertisement