Sunday, May 5, 2024

చెన్నైలో యూట్యూబర్​ అరెస్ట్​.. ఆలయాల పునరుద్ధరణ పేరుతో విరాళాల సేకరణ

తమిళనాడులో దేవాలయాల పునరుద్ధరణ, హిందూ మత ప్రచారంపై యూట్యూబ్​ చానల్​ నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ‘ఇళయ భారతం’ అనే చానెల్‌ని నడుపుతున్న యూట్యూబర్ ,  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కార్తీక్ గోపీనాథ్‌ను ఇవ్వాల (సోమవారం) ఉదయం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను హిందూ మత, ధర్మాదాయ శాఖ (హెచ్​ఆర్​అండ్​ సీఈ) డిపార్ట్​మెంట్​ పర్మిషన్​ లేకుండానే వారి పేరుచెప్పి ఈ చానెల్​ నడుపుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అరవిందన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఆవడి పోలీసులు కార్తీక్ గోపీనాథ్‌ను అరెస్ట్ చేశారు.

పెరంబలూరులోని అరుల్మిగు మధుర కాళియమ్మన్ తిరుకోయిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి అరవిందన్ ఫిర్యాదు మేరకు కార్తీక్ గోపీనాథ్ ఇళయ భారతం పేరుతో యూట్యూబ్ చానెల్‌ని తెరిచి మిలాప్‌లో డబ్బులు ఇవ్వాలని ప్రజలను కోరినట్లు పోలీసులు తెలిపారు. అరుల్మిగు మధుర కాళియమ్మ దేవాలయంలోని ఉప దేవాలయాల విగ్రహాలను పునరుద్ధరించే నెపంతో నిధుల సేకరణ కోసం వెబ్‌సైట్ రన్​ చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్తీక్ గోపీనాథ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకున్నాడని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement