Tuesday, April 30, 2024

రుతుప‌వ‌నాలు వచ్చేశాయి.. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

ప్ర‌భ‌న్యూస్, హైదరాబాద్ : భారత వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ హైదరాబాద్ కార్యాలయం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన గాలి మరియు గాలులు (30-40 kmph) సంభవించే అవకాశం ఉన్న‌ట్టు వెల్ల‌డించింది వాతావ‌ర‌ణ శాఖ‌.

కాగా, ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌, రాజన్న సయిర్‌సిల్ల జిల్లాలతో పాటు.. పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్‌’ (హెచ్చరిక) జారీ చేశారు ఐఎండీ అధికారులు. గత రెండు రోజులుగా ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతోంది.

ఆదివారం మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రుతుపవనాల రాక తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వేస‌వి వేడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించింది. IMD ప్రకారం, గాలులు లేకపోవడం వల్ల సముద్రాలలో తేమ భూమికి రాలేదు. జూన్ 6-7 తేదీల్లో రుతుపవనాలు రాష్ట్రానికి వస్తాయని భావించినప్పటికీ, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో బలహీనమైన సముద్ర గాలుల కారణంగా ఆలస్యమైందన పేర్కొంది వాతావ‌ర‌ణ శాఖ‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement