Sunday, April 28, 2024

సీఎం పదవికి రాజీనామా చేసిన యడియూరప్ప

కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు యడియూరప్ప అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నం గవర్నర్​ను కలిసి రాజీనామా లేఖను యడియూరప్ప సమర్పించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వాన్ని విజయవంతంగా ముందుకు నడిపినట్లు చెప్పారు.

కాగా, కర్ణాటకలో సీఎం మార్పు తథ్యమని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, దానిని సీఎం యడియూరప్ప ఖండించారు. అయితే, అదిష్ఠానం సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని ఇటీవల చెప్పారు. దీంతో ఇవాళ రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement