Monday, April 29, 2024

29నే వైసీపీ, బీజేపీ అభ్యర్థుల నామినేషన్‌

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది.  ఏపిల్ 17న జరిగే తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు కావడంతో అందరి దృష్టి ప్రచారంపై పడింది. ఈనెల 29న వైసీపీ, బీజేపీ అభ్యర్థులు గురుమూర్తి, రత్నప్రభ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌, పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో భాజపా అభ్యర్థి రత్నప్రభ  హైదరాబాదులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ సమక్షంలో కలిశారు. ఉప ఎన్నిక కార్యాచరణపై చర్చించారు.

మరోవైపు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఇడుపులపాయకు వెళ్లి దివంగత రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించారు. టీడీపీ బూత్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటు దిశగా సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రతి 50 మంది ఓటర్లకు వాలంటీర్లను నియమించి ఎన్నికల బాధ్యతలను అప్పగించాలని భావించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం తిరుపతిలో నేతలతో వ్యూహ రచన చేయనున్నారు.

కాగా, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement