Monday, April 29, 2024

సచిన్ కు కరోనా పాజిటివ్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నాకు కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయింది. అయితే ఇంట్లో మిగతా వారందరికీ నెగిటివ్ గానిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను హోమ్ క్వారంటైన్‌లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాను.

నాకు సపోర్ట్ చేస్తున్న వైద్యులకు ధన్యవాదాలు.. అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement