Saturday, May 11, 2024

మిని పోరులో కాంగిరేసు…

అసోంలో కాంగ్రెస్‌ పార్టీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ముస్లింపార్టీతో పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రంలో
37 శాతం ఉన్న ముస్లింల మద్దతుతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వొచ్చు. సర్వేలను బట్టి ఈసారి అసోంలో బొటాబొటీ మెజారిటీ వస్తుందంటున్నారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి బలాన్ని పుంజుకున్నట్టే. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉన్నా, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో భాగస్వామి కావచ్చు లేదా, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించవచ్చు. బెంగాల్‌లో మమతాబెనర్జీ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు అవసరమో కాదో చూడాల్సి ఉంది.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకూ, కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభకూ జరగనున్న ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంచనాలు వెలువ డ్డాయి. అయితే, మే 2 వతేదీన వెలువడే ఫలితాల్లో కొన్ని ఆశ్చర్యాలు ఉండవచ్చు. మీడియా మాత్రం బీజేపీ, మమతా బెనర్జీ, వామపక్షాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. కాంగ్రెస్‌ కేరళ, అసోంలలో కూడా గెలుపొందబోదని సర్వే నివేదికలు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ గెలవాల్సిన అవస రం ఉంది. దారుణంగా ఓడిపోకూడదు. దేశంలో ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే, రాష్ట్రాల్లో రెండు పార్టీ లూ, లేదా ఫ్రంట్‌లూ అధికారాన్ని పంచుకుంటుం టాయి. కాంగ్రెస్‌, లేదా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, అసోంలలో ఈ రెండు పార్టీలలో ఏదో ఒకటి గెలుపొందుతూ ఉంటాయి. మూడో పార్టీ శక్తిని కలిగి ఉన్నట్టయితే, కాంగ్రెస్‌ సహజంగానే వెనకబడి పోతూ ఉంటుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నాలు గింటిలో రెండు ఫ్రంట్‌లు ఉన్నాయి. పుదుచ్చేరి, కేరళ, అసోం, తమిళనాడులలో రెండు ఫ్రంట్‌లు ఉన్నాయి. వీటిలో బీజేపీ, కాంగ్రెస్‌లు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ బలమైన పార్టీలు ఉన్నాయి.
తమిళనాడు : ఇంతవరకూ అందిన సమాచారం, సంకేతాలను బట్టి పదేళ్ళ నుంచి అధికారంలో కొన సాగుతున్న అన్నా డిఎంకె ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రత్యర్ధి ఫ్రంట్‌ అయిన డిఎంకె ఫ్రంట్‌ గెలుపు తథ్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ఈ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉంది. డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తున్నారు. అందువల్ల 2021 ఎన్నికల్లో డిఎంకె విజయంలో కాంగ్రెస్‌ కూడా భాగం పంచు కుంటుంది.
పుదుచ్చేరి : పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం. అసెంబ్లిలో ముప్పయి మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఫ్రంట్‌, బీజేపీ ఫ్రంట్‌లు పోటీలో ఉన్నాయి.పరిస్థితి అస్పష్టంగా ఉంది. చిన్న రాష్ట్రం కావడం వల్ల అస్థిరత కొనసాగుతూ ఉంటుం ది. కాంగ్రెస్‌-డిఎంకె ఫ్రంట్‌ ఈసారి అధికారాన్ని కోల్పోవచ్చు.
కేరళ : కేరళలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షం. ఐదేళ్ళ నుంచి వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. నాలు గు దశాబ్దాల పరిస్థితిని పరిశీలిస్తే ఏ ప్రభుత్వమూ రెండో సారి అధికారంలోకి రాలేదు.అయితే, సర్వేల ఫలితాలను బట్టి కమ్యూనిస్టులు ఈసారి కూడా గెలు పొందవచ్చు.అయితే, కాంగ్రెస్‌ విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ. అయితే, అది కమ్యూనిస్టుల ఓట్లకు గండికొట్ట వచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మొత్తం 20 సీీట్లలో 19స్థానాలను గెల్చుకుంది.కేరళలో క్రైస్తవు లు, ముస్లింల జనాభా ఎక్కువ. వీరంతా బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడానికి కాంగ్రెస్‌కి మద్దతుఇవ్వొచ్చు. కాంగ్రెస్‌ నెగ్గవచ్చు. లేదా పెద్ద ప్రతిపక్షంగా అవతరించవచ్చు.
బెెంగాల్‌ : బెంగాల్‌ ఎన్నికల బరిలో అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీ కొత్తగా ఎదుగుతున్న పార్టీ. తృణ మూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాష్ట్రం లో పదేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రత్యర్ధులుగా ఉన్న కాంగ్రెస్‌, వామపక్షాలు పొత్తు కలిగి ఉన్నాయి. బెంగాల్‌లో మూడు రాజకీయ ఫ్రంట్‌లు ఉన్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మమతాబెనర్జీ పార్టీ మొత్తం 42 స్థానాల్లో 22 సీట్లను గెల్చుకుంది. బీజేపీ 18 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ రెండు స్థానా ల్లో గెలుపొందింది. రాష్ట్ర ఓటర్లలో ముస్లింలు 27 శాతం ఉన్నారు. 2016ఎన్నికల్లో ముస్లింలు వ్యూహా త్మకంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, తృణ మూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధుల్లో ఎవరు బలమైన వారైతే వారికి ముస్లింలు మద్దతు ఇచ్చారు. బెంగాల్‌లో 294 అసెంబ్లిd స్థానాలు ఉన్నాయి. మమతా బెనర్జీ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోతే ఆ పార్టీ కాంగ్రెస్‌ మీద ఆధారపడవచ్చు. కాంగ్రెస్‌ కలిసొచ్చే ప్రధానాంశం అదే. సర్వేలను బట్టి మమతా బెనర్జీకి తక్కువ మెజారిటీ రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్‌ రాష్ట్రంలో కీలక పాత్ర వహించవచ్చు.
అసోం : అసోంలో కాంగ్రెస్‌ 2001నుంచి 2016 వరకూ అధికారంలో ఉంది. ప్రస్తుతం బీజేపీ అధికా రంలో ఉంది. ఆ పార్టీ2016లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభలో 124స్థానాలు ఉన్నా యి. రాష్ట్ర జనాభాలో హిందువులు, ముస్లింలు, గిరి జనలు, బెంగాలీలు ఉన్నారు. ముస్లింలు 37 శాతం ఉన్నారు. 1981లో బంగ్లాదేశ్‌ నుంచి, ముస్లింలు, ఇతరులు తమ రాష్ట్రంలోకి వలస రావడంపై రాష్ట్రం లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అసోం ఆందోళనకారులకూ, కేంద్రానికి మధ్య ఒప్పందం కుదిరింది. చొరబాటుదారులను కట్టడిచేసే విషయ మై ఈ ఒప్పందం కుదిరింది. అక్రమంగా అసోంలొ ప్రవేశించిన వారికి పౌరసత్వాన్ని రద్దుచేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.ఎవరు చొరబా టు దారులో తేల్చేందుకు జనాభా లెక్కలు సేకరించా రు. విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాన్ని ఉపసంహ రించేందుకు బీజేపీ ప్రభుత్వం రెండుచట్టాలను తెచ్చింది. 37 శాతం ముస్లింలు, బెంగాలీల్లో చాలా మంది బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ అధికారం లోకి వస్తే తమ పౌరసత్వం రద్దవుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. అసోంలో కాంగ్రె స్‌ పార్టీ బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ముస్లిం పార్టీతో పొత్తు కుదుర్చుకుంది.రాష్ట్రంలో 37 శాతం ఉన్న ముస్లింల మద్దతుతో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వొచ్చు. సర్వేలను బట్టి ఈసారి అసోంలో బొటాబొటీ మెజారిటీ వస్తుందంటున్నారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి బలాన్ని పుంజుకున్నట్టే.
కాంగ్రెస్‌ బాగా పుంజుకుంటే…ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉన్నా, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో భాగస్వామి కావచ్చు లేదా, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించవచ్చు. బెంగాల్‌లో మమతాబెనర్జీ పార్టీకి కాంగ్రెస్‌ మద్దతు అవసరమో కాదో చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలోనూ గెలుపొందకపోయినా బాగా బలాన్ని సంపాదించుకుంటుంది.
కాంగ్రెస్‌ తిరిగి పుంజుకుంటే, వ్యవస్థాగత ఎన్నికల ను నిర్వహించవచ్చు. రాహుల్‌ గాంధీని తిరిగి అధ్యక్షు నిగాఎన్నుకోవచ్చు. పార్టీ నాయకత్వం మార్పును కోరిన జి-23కూటమిగా పేరొందిన సీని యర్‌ నాయకులను పార్టీనుంచి బహిష్కరించే అవకా శం ఉంది. లేదా వారిని పక్కకు తప్పించవచ్చు. పాతతరం నాయకులు తెరవెనక్కి నెట్టబడవచ్చు. ఎన్నికల ప్రచారంలో పాతతరం నాయకుల్లో ఒక్కరి ని కూడా కాంగ్రెస్‌ ఆహ్వానించలేదు. రాహుల్‌, ఆయ న సోదరి ప్రియాంకలు మాత్రమే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్‌ బాగా నష్టపోతే…: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బాగా నష్టపోతే వ్యవస్థాగత ఎన్నికలు వాయిదా పడవచ్చు. కాంగ్రెస్‌ అధ్యక్షునిగా రాహుల్‌ గాంధీ ఎన్నికకాకపోవచ్చు. ఎవరో ఒకరుఎన్నిక కావచ్చు. అయితే, బీజేపీ వ్యతిరేక మేధావి వర్గానికి చెందిన రామచంద్ర గుహ వంటి వారు చెప్పేదేమం టే, గాంధీ కుటుంబ వారసుల పట్టు ఉన్నంత కాలం కాంగ్రెస్‌ తిరిగి పునర్‌ వైభవాన్ని పొందకపోవచ్చు. రాహుల్‌ గాంధీ కుర్తా, పైజమాలకు బదులు జీన్స్‌, ఆధునిక దుస్తులు ధరిస్తున్నట్టు ప్రజలు గ్రహించారు. బహిరంగంగా వ్యాయామం చేయడం వంటి విన్యాసాలు చూస్తున్నారు. 52 ఏళ్ళ రాహుల్‌ ఇతర సీనియర్‌ నాయకుల వంటి వారన్న సందేశాన్ని పంపడమే ఉద్దేశ్యం కావచ్చు.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి కూడా కీలకమై నవే. అసోంలో బీజేపీ ప్రజాదరణ పొందిందా? కేరళలో బలాన్నిపుంజుకుందా? బెంగాల్‌లో నిజం గానే బలాన్ని సంపాదించిందా? అనే విషయాలు రుజువు కావచ్చు. మమతా బెనర్జీ తిరిగి అధికారం లోకి వస్తే బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధి కావచ్చు. అయితే, మిశ్రమ ఫలితాలు వచ్చే అవ కాశాలు కూడా ఉన్నాయి. భారత్‌లో ఎన్నికలు నిరంత రం జరుగుతూ ఉంటాయి.

  • డాక్టర్ పెంటపాటి పుల్లారావు..
Advertisement

తాజా వార్తలు

Advertisement