Sunday, May 5, 2024

“యాత్ర 2” రిలీజ్ డేట్ ఫిక్స్.. వైరల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్క‌న సినిమా ‘యాత్ర’. వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నాలుగేళ్ల క్రితం (2019) విడుదలైంది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు మహి వి.రాఘవ్‌ ప్రకటించాడు.

కాగా, ఈ సీక్వెల్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి పాదయాత్ర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకు ఉంటుందని ఆయన ఇటీవల వెల్లడించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అయితే ‘యాత్ర-2’కి వారం ముందుగానే విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసి ఆశ్చర్యపరిచారు మేక‌ర్స్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌లోని ‘నేనెవరో ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి.. నేను వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకును’ అనే లైన్లు ‘యాత్ర 2’ కథను తెలియజేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ సీఎం పీఠం ఎక్కే వరకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో యాత్ర 2 కథ సాగుతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.

- Advertisement -

సీఎం జగన్ చేపట్టిన పాదయాత్రను హైలైట్ చేస్తూ ఈ మూవీని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. అయితే సీఎం జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా ప్రకటించలేదు.. కానీ ఆ పాత్రలో తమిళ హీరో జీవా నటించబోతున్నట్లు రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement