Tuesday, April 30, 2024

Yadadri – గరుడ వాహనంపై నర్సన్న విహారం


= మహా విష్ణు అలంకారంలో నారసింహుడు
= కన్నులపండువగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
= కొండపైన కిక్కిరిసిన భక్త జనం
= సాయంత్రం దివ్య విమాన రథోత్సవం

యాదాద్రి, (ప్ర‌భ న్యూస్‌) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాద‌గిరి గుట్ట‌ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జ‌ర‌గుతున్నాయి. ప్రతి రోజు ఉదయం, రాత్రి స్వామి అమ్మవార్లను వివిధ సుగంధ రకాల పుష్పలతో అలంకరించి.. వాహన సేవలపై ఊరేగిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం స్వామివారు మహా విష్ణు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామి వారిని వజ్ర వైడూర్యాలు, వివిధ రకాల సుగంధాలు విరజిల్లే పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. అర్చకులు, వేద పండితులు, వేదమంత్రాలు, వేదపారాయణలు.. మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కరరావు, డీఈవో దోర్బాల భాస్కర్, ఏఈవోలు రామ్మోహన్, జూసెట్టి కృష్ణ,రమేష్ బాబు, శ్రవణ్ కుమార్, రఘు, ఆలయ సిబ్బంది, పెద్ద ఎత్తున భ‌క్త‌జ‌నం పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement