Friday, May 17, 2024

WPL | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై !

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ బౌలింగ్ ఎంచుకుంది.

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ – డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండూ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో 3 విజయాలు – 1 ఓటమితో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఇవ్వాల్టి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.

ముంబై ఇండియన్స్ మహిళలు:

యాస్తికా భాటియా (WK), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజన, హుమైరా కాజీ, అమంజోత్ కౌర్, సైకా ఇషాక్, షబ్నిమ్ ఇస్మాయిల్.

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు:

- Advertisement -

మెగ్ లానింగ్ (c), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, జెస్ జోనాస్సేన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (WK), శిఖా పాండే, టిటాస్ సాధు, రాధా యాదవ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement