Saturday, May 18, 2024

T20 WC | ఇక‌ ఫ్రీగా చూసేయండి..

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్‌ వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. అమెరికా వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29వ తేదీ వరకు సాగనున్న ఈ టోర్నీలో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ యూజర్లు వరల్డ్‌ కప్‌-2024 మ్యాచ్‌లను అన్నింటినీ ఫ్రీగా చూడొచ్చని తెలిపింది.

ఇక టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్‌ ఐర్లాండ్‌తో జూన్ 5న జరగనుంది. అందరూ ఎంతగానో ఎదురుచూసే పాకిస్తాన్‌- ఇండియా మ్యాచ్‌ జూన్‌ 9వ తేదీన జరగనుంది. మరోవైపు ఈనెలలో ప్రారంభం అవుతున్న ఐపీఎల్ 17వ‌ సీజన్ మ్యాచ్‌లు జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా కూడా ఉచితంగానే మ్యాచ్‌లు చూసేందుకు అవకాశం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement