Friday, May 3, 2024

వ‌ర‌ల్డ్ ఆఫ్ శ‌బ‌రి.. వన్ ఉమెన్ షో

శ‌బ‌రి చిత్రం నుండి వ‌ర‌ల్డ్ ఆఫ్ శ‌బ‌రి పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు మేక‌ర్స్.ఒక ఫారెస్టు ఏరియాలో తన పాపను పెట్టుకుని ‘శబరి’ ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఒక రోజు రాత్రి ఒక ఒక ఆగంతుకుడు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అతని బారి నుంచి ఆమె తన కూతురిని ఎలా కాపాడుకుంది? ఇంతకీ అతను ఎవరు.. అనే సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.ఈ చిత్రంలో న‌టి వరలక్ష్మి శరత్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ని పోషిస్తోంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళ … మలయాళ .. హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement