Sunday, February 25, 2024

రాష్ట్రంలోకి వస్తే రామ్ గోపాల్ వర్మ నాలుక కోస్తాం.. ఊకా.విజయ్ కుమార్

తిరుపతి సిటీ : రాంగోపాల్ వర్మ రాష్ట్రంలో అడుగుపెడితే నాలుక కోస్తామని కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… సీఎం దగ్గర ఎంత డబ్బులు తీసుకుని ట్విట్ చేసావని విమర్శించారు. రాజ్యాధికారం కోసం కాపులు పోరాటం చేస్తూ ఉంటే అమ్ముడు పోతున్నారని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రచారం కోసం పని పాట లేని వర్మ పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేయడం దారుణమ‌న్నారు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిస్తే తమ ఓటమి ఖాయమనే వైఎస్ఆర్సిపీ కాపులను తిట్టిస్తున్నారని విమర్శించారు. కాపుల్లో విభజన కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాలతో ప్రతిపక్షాలు ఒకరితో ఒకరు పొత్తులు పెట్టుకుంటున్నారు. రాజ్యాధికారం కోసం కాపులు పోరాడుతుంటే అమ్ముడు పోతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాపుల మంత్రులకు ఆత్మాభిమానం లేదన్నారు. కాపులను సీఎం తిట్టిస్తుంటే నోరెత్తి ఖండించడం లేదన్నారు. కాపులు అమ్ముడుపోయారన్న రాంగోపాల్ వర్మ ఎంతకు అమ్ముడు పోయారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాపులను విమర్శించేటప్పుడు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారు విమర్శించాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ కోసం దత్తపుత్రుడని వివిధ రకాల విమర్శలు చేయడం సరికాదన్నారు. విమర్శలు చూస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి దిగజారుడుతనం ఏందనేది ప్రజలకు అర్థమవుతుందన్నారు. రాష్ట్ర పర్యవేక్షణ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటిగా కలిసి పోరాడుతున్నారన్నారు. విమర్శించే ముందు తెలుసుకొని మాట్లాడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement