Thursday, April 25, 2024

యాక్సిడెంట్ జ‌ర‌గ‌డం వ‌ల్లే సినిమాల‌కి దూరమ‌య్యా.. న‌భా న‌టేష్

పోయిన ఏడాది త‌న‌కి యాక్సిడెంట్ అయింద‌నీ..దాంతో ఎడమ భుజం దగ్గర బోన్స్ విరగటం వలన సర్జరీలు జరిగాయని చెప్పింది హీరోయిన్ న‌భా న‌టేశ్. ఈ కారణంగానే తాను సినిమాలకి దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌ని అస‌లు విష‌యాన్ని చెప్పింది. నిజంగా అది చాలా కష్టతరమైన పరిస్థితి అని. దానిని దాటుకుని మళ్లీ సినిమాలు చేయడానికి ట్రై చేయడం అంత తేలికైన పనేం కాదంది ఈ బ్యూటీ. కానీ మీ అందరి అభిమానం వలన నేను త్వరగా కోలుకున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులను ఉద్దేశించి ఒక లెటర్ రాసింది. నభా నటేశ్ హఠాత్తుగా కనిపించకుండా పోవడానికి కారణం ఇదా అంటున్నారు నెటిజ‌న్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement